రెజినాకు లక్కీ ఛాన్స్..!

కుర్ర హీరోలకు సరైన జోడి అనిపించుకున్న రెజినా స్టార్ స్టేటస్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. వరుస సినిమాలు చేస్తున్న అమ్మడు యువ హీరోలకు బెటర్ ఆప్షన్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఓ లక్కీ ఆఫర్ రెజినా చెంత చేరిందట. అదే నాచురల్ స్టార్ నానితో కలిసి పనిచేసే అవకాశం. వరుస విజయాలతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న నాని ప్రస్తుతం నేను లోకల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత శివ శంకర్ అనే కొత్త దర్శకుడితో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక దాని తర్వాత తానే సొంతంగా ఓ సినిమా నిర్మించేందుకు నడుం బిగించాడు. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో హీరోయిన్ గా రెజినాను కావాలని తీసుకున్నారట నాని. నాని కోరి మరి రెజినాను సెలెక్ట్ చేశాడంటే కచ్చితంగా అమ్మడికిది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. రీసెంట్ గా జ్యో అచ్యుతానంద సినిమాలో తన పాత్రతో అందరిని అలరించిన రెజినా అవసరాల డైరక్షన్లో మరో అవకాశం దక్కించుకుంది.

మరి నాని, రెజినాల క్రేజీ కాంబో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నిటిలో రెజినా ఈ ప్రాజెక్ట్ మీదే తన ఆశలను పెట్టుకుంది. ఇక ఓ పక్క టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.