
సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పెళ్లి చేసుకోవడమే అన్న తీరున ప్రవర్తించిన సమంత మళ్లీ వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టే తరుణం దగ్గర పడుతున్నా సమంత తన సినిమా అవకాశాలని మాత్రం వదలట్లేదు. ఇప్పటికే కోలీవుడ్లో విశాల్ సరసన నటించేందుకు ఓ సినిమా సైన్ చేసిన సమంత తాజాగా పవర్ స్టార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
ఇంతకీ పవన్ తో ఏ సినిమాలో సమంత చేస్తుంది అంటే త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్లో చేస్తున్న సినిమా అని అంటున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది, అఆ సినిమాల్లో సమంతను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న త్రివిక్రం ఇప్పుడు పవన్ తో తీసే దేవుడే దిగి వచ్చినా సినిమాకు ఆమెనే తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఎలాగు పెద్ద సినిమా కాబట్టి సమంత కూడా నో అని చెప్పడానికి వీలు ఉండదు.
సో అలా సమంత మళ్లీ తన సినిమాలను మొదలు పెట్టబోతుంది. ఈ సంవత్సరం నాలుగు సినిమాలతో అలరించిన సమంత వచ్చే ఏడాది ఒక్క సినిమాలో కూడా కనిపించదా అనుకుని బాధపడుతున్న ఆమె ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ త్రివిక్రం క్రేజీ కాంబినేషన్ అంటే అది హిట్ సినిమా అన్నట్టే మరి ఆ హిట్ సినిమాకు సైన్ చేయకుండా సమంత ఎలా ఉంటుంది చెప్పండి.