సిటాడెల్ ప్రీమియర్ షోలో సమంత... అదిరిపోయిందిగా!

సమంత శాకుంతలం సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా అది తీవ్ర నిరాశపరిచింది. ఇంకా దాని గురించి చింతిస్తూ కూర్చోనే టైమ్ సమంతకు లేదు కనుక వెంటనే సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్ షో ఈవెంట్ కోసం లండన్ వెళ్ళిపోయింది. 

రూసో బ్రదర్స్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తుండగా దాని భారతీయ వెర్షన్‌లలో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వంటి సూపర్ హిట్ వెబ్‌ సిరీస్‌ అందించిన నే రాజ్‌ అండ్ డికె దర్శకత్వంలో దీనికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై బారీ అంచనాలున్నాయి. ఈ సందర్భంగా లండన్ బ్రిడ్జిపై దిగిన కొన్ని ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్సులో సమంతని చూసినప్పుడు శాకుంతలంలో కనిపించిన సమంతేనా ఈమె? అని అనుమానం కలుగుతుంది. అంత మోడ్రన్‌గా, స్టయిలి గా కనిపిస్తుంది.