సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఏజంట్ ట్రైలర్ విడుదల చేశారు. ఇది యాక్షన్ త్రిల్లర్ కనుక ట్రైలర్లో అఖిల్ యాక్షన్ సీన్స్ వాటితో పాటు తుపాకులు మోత మారుమ్రోగిపోయింది. ఈ మద్యలో హీరోయిన్ సాక్షి వైద్యను ఓసారి చూపించారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమూట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియో ప్రధానపాత్రలు చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామభద్రం సుంకర, అజయ్ సుంకర, పతి దీపారెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కధ వక్కంతం వంశీ, స్టంట్స్: విజయ్ మాస్టర్, స్టంట్ శివ, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: నవీన్ నూలి, కెమెరా: రసూల్ ఎల్లోరే, సంగీతం: హిప్ హాప్ తమీజా అందించారు.