బిచ్చగాడు-2 నుంచి చెల్లీ వినవే.... గుండెలు పిండేసే పాట

విజయ్‌ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు బిచ్చగాడు-2తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి విజయ్‌ ఆంటోనీ దర్శకత్వం, సంగీత దర్శకత్వం, ఎడిటింగ్ కూడా చేస్తూ తమ సొంత బ్యానర్‌ ‘విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ బ్యానర్‌పై ఫాతిమా ఆంటోనీతో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో చెల్లీ వినవే అంటూ చాలా ఆర్ద్రతతో సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. భాష్యశ్రీ వ్రాసిన ఈ పాటను విజయ్‌ ఆంటోనీ ఎంతో అద్భుతంగా స్వరపరచగా అనురాగ్ కులకర్ణి ఎంతో ఆర్ద్రతతో పాడారు. దానిలో ఓ బాలుడు తన చెల్లి ఆకలి తీర్చేందుకు పడుతున్న తిప్పలు, ఆమెను సంతోషపరచడం కోసం చేస్తున్న ప్రయత్నాలను వీడియోలో అంతే చక్కగా చూపారు. అన్నా చెల్లెళ్ళుగా మదేష్, శివన్య ఇద్దరూ అద్భుతంగా నటించారు. తల్లితండ్రుల సంరక్షణలో ఎంతో హాయిగా జీవిస్తున్న ఆ చిన్నారులు ఇద్దరూ ఏవిదంగా అనాధలయ్యారో ఈ పాటలోనే చూపడటం ద్వారా ఈ కధ ఎలా మొదలయ్యిందో చక్కగా చెప్పినట్లయింది.         

బిచ్చగాడు-2లో విజయ్‌ ఆంటోనీ, కావ్య థాపర్ ప్రధానపాత్రలలో చేస్తున్నారు. దీనిలో దేవ్ గిల్, జాన్ విజయ్, మన్సూర్ ఆలీ ఖాన్, రాజా కృష్ణమూర్తి, హరీష్ పెరడి, రాధా రవి, వైజీ మహేంద్రన్, తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: విజయ్‌ మిల్టన్, కధ, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం: విజయ్‌ ఆంటోనీ అందిస్తున్నారు.  దీనిని కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.