బెల్లంకొండ సినిమా ఆగిపోయిందా..?

డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా మంచి ఫాంలో ఉన్న దిల్ రాజుకి వస్తు వస్తూనే షాక్ ఇచ్చారు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్. పెద్ద హీరోల సినిమాలను ఎవరు ఊహించని రేంజ్ లో కొనేసి లాభాలని గడించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఒకేసారి ఐదు సినిమాలను మొదలు పెట్టిన ఈ ప్రొడక్షన్ లో స్టార్ట్ అయిన బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఆగిపోయిందని టాక్. 

బెల్లంకొండ సురేష్ తనయుడు హీరోగా వస్తున్న మూడో సినిమా ఇది. అయితే సినిమాలో సురేష్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ కావడం వల్లనే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని అంటున్నారు. అయితే ఇది ఓ కారణం అవగా కొంతమంది బయట ఇన్వెస్టర్స్ ఇందులో భాగస్వామ్యంతో నడిపిస్తుండగా కబాలి లాసులకు వారు బెంబేలెత్తిపోయి చేతులు ఎత్తేశారట. అందుకే ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో ఉన్న సినిమాలు అయోమయంలో పడ్డాయట.

మరి నిజం ఏదైనా సరే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఆగిపోయిందన్నది వాస్తవం. ఆ సినిమా ఆగిపోడానికి కారణాలు ఏవైనా బోయపాటి లాంటి ఫాంలో ఉన్న డైరక్టర్ కు ఇలా స్టార్ట్ అయిన సినిమా ఆగిపోవడం కాస్త హెడేక్ అనే చెప్పాలి.