
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రభాస్ అభిమానులకు ఈరోజు ఓ గొప్ప శుభవార్త చెప్పారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ పూర్తయిన తర్వాత ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడని, అది పౌరాణికమని చెప్పారు. ఇప్పటికే దీని స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. అవి పూర్తవగానే ఈ ప్రాజెక్టుకు సంబందించి పూర్తి వివరాలు వెల్లడిస్తాము,” అని చెప్పారు.
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్‌ను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. దీనిని 2023, సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు హోంభలే ఫిల్మ్స్ ట్విట్టర్లో ప్రకటించింది.
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పూర్తి చేసి మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నారు. ఇవి గాక నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ చేయబోయే సినిమాల జాబితాలో ప్రశాంత్ నీల్ సినిమా కూడా చేరింది.