ఇదిగో... అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పార్టీ ఫోటో

యువనటుడు సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు.’ దీనిలో సుహాస్ బ్యాండ్ వాయించే మల్లిగాడు పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ మంగళవారం విడుదలైంది. మల్లికార్జున సెలూన్ షాప్ ముందు బ్యాండ్ మేళం యూనిఫారం ధరించి వాద్య పరికరాలు వాయిస్తున్నట్లు చూపారు.         

ఈ సినిమాతో సుశ్యంత్ కటికనేని దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు పార్టీలో జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకొన్న వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని కలిసి మహా క్రియెషన్స్, జీఏ2, పిక్చర్స్, స్వేచ్చ క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం, వాజిద్ బేగ్, సినిమాటోగ్రఫీ, కొడాటి పవన్‌ కళ్యాణ్‌ ఎడిటింగ్ చేస్తున్నారు.