
ప్రేమం హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కేసిన అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు తన తర్వాత సినిమా సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కార్యక్రమాలను చూస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అసలైతే ప్రేమం ముందే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కుదరలేదు. ఇక తమిళ వర్షన్ కు ఇన్నాళ్లు ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోగా ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముహుర్తం పెట్టనున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం సాహసం శ్వాసగా సాగిపో సినిమా నవంబర్ లో రిలీజ్ అంటున్నారు. ఇక ఈ సినిమా రషెష్ చూసిన దిల్ రాజు నైజాంలో తను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి దిల్ రాజు చూసి కన్ఫాం చేశాడంటే సినిమాలో కచ్చితంగా విషయం ఉన్నట్టే. సో ఈ లెక్కన చైతు సాహసం కూడా హిట్ ఇస్తుందని అనుకోవచ్చు.
ఓ పక్క నిర్మాతగా సూపర్ ఫాంలో ఉన్న దిల్ రాజు మరో పక్క డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి క్రేజ్ లో ఉన్నాడు. నైజాంలో మంచి పట్టు ఉన్న దిల్ రాజు తన సినిమాలకే కాదు పంపిణీ చేసిన సినిమాలను కూడా తన సినిమాల రేంజ్లో రిలీజ్ చేస్తాడు. అందుకే పెద్ద సినిమాలకు నిర్మాతల కన్నా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఎక్కువ లాభాలు దక్కించుకున్నాడు.