విరూపాక్ష ట్రైలర్‌ మామూలుగా లేదుగా!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరం తేజ్, సంయుక్త మేనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. నేడు విరూపాక్ష ట్రైలర్‌ విడుదల చేశారు. ఓ అటవీ ప్రాంతంలో మారుమూల రుద్రవనం అనే ఓ చిన్న గ్రామంలో జరుగుతున్న కొన్ని అనూహ్యమైన ఘటనలు, క్షుద్రశక్తులు, తాంత్రిక పూజలను కధాంశంగా తీసుకొని తెరకెక్కించిన థ్రిల్లర్ సినిమా ఇది. మన హీరో సాయిధరం తేజ్ ఆ క్షుద్రశక్తుల నుంచి ఆ ఊరిని  ఏవిదంగా కాపాడుకొంటాడు? ఆ ప్రయత్నంలో హీరోయిన్‌ సంయుక్త మేనన్ ఏవిదంగా ఆస్థానికీ తోడ్పడింది? అనేది ఏప్రిల్ 21వ తేదీన సినిమా విడుదలైనప్పుడు చూడాలి. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్ ముక్యపాత్రలు చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎసెన్ ప్రసాద్ విరూపాక్ష సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: బి,అంజనీష్ లోక్‌నాధ్, కెమెరా: షాందత్ సైనుద్దీన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.