నర్సింగ్ హోం డైరక్టర్ కు లక్కీ ఛాన్స్..!

టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలకు కొదవలేదు. ఈ మాట సినిమా పరిశ్రమలో బాగా వినిపిస్తుంది. కరెక్ట్ గా వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలే కాని మొదటి సినిమాతోనే ఓ రేంజ్ క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన నందిని నర్సింగ్ హోం డైరక్టర్ పివి గిరి ఆ కోవలోకి వచ్చేశాడు. సీనియర్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. 

అయితే సినిమా హిట్ కొట్టాడో లేదో మరో సినిమా అవకాశం కొట్టేశాడు. పివిపి బ్యానర్ నుండి పిలుపు వచ్చిందట ఈ డైరక్టర్ కు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి త్వరలో ఫైనల్ అవుతుంది అంటున్నారు. మొత్తానికి నందిని నర్సింగ్ హోం సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన పివి గిరి మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించాడు. రాసుకున్న కథ ఏదైనా అనుకున్న విధంగా చెప్పగలిగితే డైరక్టర్ గా సక్సెస్ అయినట్టే సో గిరి ఆ విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు.  

ఇక పివిపి సినిమా అంటే దాదాపు పెద్ద ప్రొడక్షన్ అనే చెప్పాలి. క్షణం తర్వాత చిన్న సినిమాల మీద కూడా ఓ కన్నేసిన పరం వి పొట్లూరి ఇప్పుడు గిరితో కూడా మీడియం బడ్జెట్ లో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. పివిపి ఇచ్చిన అవకాశాన్ని గిరి ఏ విధంగా వినియోగించుకుంటాడో చూడాలి.