అమెజాన్ ప్రైమ్‌లో రంగమార్తాండ...

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లీగంజ్, ఆదర్శ్ ప్రధానపాత్రలలో రంగమార్తాండ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదలై ప్రశంశలు అందుకొంటోంది. మరాఠీ సినిమా నటసామ్రాట్ సినిమాకు ఇది తెలుగు రీమేక్ అయినప్పటికీ, ప్రధాన కధాంశంలో మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తీశారు. బలగం సినిమాలాగే దీనికి ఎటువంటి ప్రమోషన్స్, హడావుడి ఏదీ చేయలేదు కానీ బలగం సినిమాలాగే రంగమార్తాండ కూడా అందరి ప్రశంశలు అందుకొంటోంది. అయితే జనాలు పెద్ద హీరోహీరోయిన్ల డ్యాన్సులు, ఫైట్స్ ఉండే సినిమాలు చూడటానికి అలవాటు పడినందున ఇటువంటి మంచి సినిమాలు థియేటర్లలో నిలద్రొక్కుకొని కలక్షన్స్‌ సాధించడం చాలా కష్టమే. కనుక బలగం సినిమాలాగే రంగమార్తాండ సినిమా కూడా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.