శ్రీరామనవమికి ఆదిపురుష్ పోస్టర్‌... చూసి బాధపడొద్దు!

నేడు శ్రీరామ నవమి సందర్భంగా ప్రభాస్‌, కృతి సనన్ నటించిన ఆదిపురుష్‌ సినిమాలోని పోస్టర్‌ విడుదల చేశారు. ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్-లుక్‌ పోస్టర్‌, టీజర్‌లో శ్రీరాముడు, హనుమంతుడు, రావణాసురుడు తదితరుల వేషధారణ, గ్రాఫిక్స్‌పై సర్వత్రా విమర్శలు రావడంతో అప్పటి నుంచి మళ్ళీ మరో పోస్టర్‌, వీడియో విడుదల చేసేందుకు దర్శకుడు ఓం రౌత్ సాహసించలేకపోయారు.

ఈ కారణంగా సినిమా రిలీజ్‌ కూడా వాయిదా వేసుకొన్నారు. ఇన్ని రోజుల తర్వాత విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో కూడా సీతారామలక్షణ, హనుమంతుల వారి వేషధారణ అదేవిదంగా ఉండటం దిగ్బ్రంతి కలిగిస్తుంది. శ్రీరాముడుకి మీసాలు, కవచం, హనుమంతుడికి గడ్డం బహుశః ఉత్తరాది హిందువులు కూడా అంగీకరించలేకపోవచ్చు. కోట్లాది హిందువుల మనసులలో ముద్రించుకొన్న సీతారామలక్షణ ఆంజనేయస్వామి వారి రూపాలకు పూర్తి భిన్నంగా ఆదిపురుష్‌లో రూపాలు, వేషధారణ ఉండటం బహుశః ఎవరూ జీర్ణించుకోలేరు. వందల కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా మూవీగా తీస్తున్నప్పుడు ఇంత ముఖ్యమైన విషయాన్ని దర్శక నిర్మాతలు, చివరికి ప్రభాస్‌ ఏవిదంగా విస్మరించారో అర్దం కాదు.

శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ఈ తాజా పోస్టర్‌ చూస్తే మరోసారి నిర్వేదం కలుగుతుంది. మళ్ళీ దీనిపై వచ్చే ఈ విమర్శలను చూస్తే అర్దం అవుతుంది.

దీనిలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్, లక్ష్మణుడుగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. 

 ఆదిపురుష్‌ సినిమాను  రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు. ఆదిపురుష్‌ సినిమాని 2024, జూన్ 16న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.