రామ్ చరణ్‌ పుట్టినరోజు కానుకగా ఫస్ట్-లుక్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎస్.శంకర్ దర్శకత్వంలో సిద్దం అవుతున్న సినిమాలోని రామ్ చరణ్‌ ఫస్ట్-లుక్‌ ఫోటోని రిలీజ్‌ చేశారు. చాలా రఫ్-లుక్‌తో కనిపిస్తున్న రామ్ చరణ్‌ ఓ బైక్‌పై కూర్చొని వెనక్కు తిరిగి చూస్తున్న ఫోటోని రిలీజ్‌ చేశారు. దీనిపై రామ్ చరణ్‌ స్పందిస్తూ, “ఇంతకంటే గొప్ప పుట్టినరోజు బహుమతి నేను అడగలేకపోయేవాడిని. థాంక్ యూ శంకర్ సర్,” అని ట్వీట్‌ చేశారు.  

రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ గ్రాఫిక్ వీడియోను కూడా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

గేమ్ చెంజర్ సినిమాలో రామ్ చరణ్‌, కియరా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలు చేస్తుండగా, ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు.