అదిరే రేంజ్లో ఖైది శాటిలైట్ రైట్స్..!

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఖైది నెంబర్ 150. తమిళ కత్తి సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతుండగానే బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుంది. ఇప్పటికే ఏరియాల వైజ్ గా మెగా రికార్డులను క్రియేట్ చేస్తున్న ఖైది నెంబర్ 150 సినిమా ఇప్పుడు శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా సంచలనం సృష్టిస్తుంది.

మా టివి వారు ఏకంగా 14 కోట్లకు ఖైది శాటిలైట్ రైట్స్ కొన్నారట. అయితే ఇంకా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయట పెట్టాల్సి ఉంది. ఇప్పటికే మాటివిలో మీలో ఎవరు కోటిశ్వరుడు నాలుగో సీజన్లో మెగాస్టార్ కనిపించబోతున్నారు. ఇక ఆ క్రమంలోనే మా టివి వారే భారీ మొత్తంతో ఖైది శాటిలైట్స్ అందుకున్నారు. జీ తెలుగు వారు 12 కోట్ల దాకా వచ్చి వెనక్కి తగ్గారని తెలుస్తుంది. ఇక జెమిని వారైతే కేవలం 10 దగ్గరే ఆగారట.

సో మొత్తానికి సినిమా రిలీజ్ కు ముందే ఖైది సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ కూడా పొంగల్ టార్గెట్ తో వస్తుంది. మరి చిరు బాలయ్యల పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.