
బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ బాహుబలి పార్ట్ 2 ముగింపు కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ డైరక్షన్లో ఓ మూవీ కమిట్ అయిన ప్రభాస్ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీనే ప్రిఫర్ చేస్తున్నాడట. రాజమౌళి వల్ల దేశం మొత్తం తన అభిమానులను ఏర్పరచుకున్న ప్రభాస్ ఇప్పటి నుండి చేసే ప్రతి సినిమా అన్ని చోట్ల రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా బడ్జెట్ కూడా 150 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.
బాహుబలి తర్వాత అంత బడ్జెట్ ఉన్న సినిమా ఇదే అని చెప్పాలి. ఇక హీరోయిన్ గా పరిణీతి చోప్రాని అడిగే అవకాశాలున్నాయట. ఇంతకుముందే ప్రభాస్ తో తాను నటించేందుకు సిద్ధమే అంటూ పరిణీతి కూడా ఎనౌన్స్ చేసింది. ఒకవేళ పరిణీతి డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే కనుక సోనాక్షి సిన్హా ను పెట్టుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
సో మొత్తానికి సుజిత్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా మాత్రం బాలీవుడ్ నుండి దించడం ఖాయమని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రేంజ్ కూడా బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా బిజినెస్ చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ప్రభాస్ వేరే సినిమాకు పని చేయబోతున్నాడు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ లోనే సూజిత్ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్.