ఆ డైరక్టర్ తో అఖిల్ మూవీ..!

అక్కినేని వారసుడు యువ నటుడు అఖిల్ మొదటి సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం కావొస్తున్నా ఇంకా తన సెకండ్ మూవీకి ముహుర్తం పెట్టలేదు. విక్రం కుమార్ తో తన సెకండ్ మూవీ చేస్తున్న అఖిల్ ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో తన మూడో సినిమా గురించి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ తన థర్డ్ మూవీ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో చేసే అవకాశాలున్నాయట.

స్టార్ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులుండాలో అవన్ని తన సినిమాలో ఉండేలా చూసుకుంటూ ఫ్యాన్స్ ను నూటికి నూటి పాళ్లు సాటిస్ఫై చేసే దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకే అఖిల్ కూడా తన థర్డ్ మూవీ బోయపాటి లాంటి డైరక్టర్ తో చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే మాస్ ఇమేజ్ కోసం అఖిల్ ఇప్పటికే మొదటి సినిమా వినాయక్ డైరక్షన్లో చేసి ఫ్లాప్ చవి చూశాడు మరి అలాంటిది మళ్లీ అలాంటి సినిమానా అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

అయితే బోయపాటి లెక్కలు వేరేలా ఉంటాయి. అఖిల్ కు కూడా తన రేంజ్ హిట్ ఇచ్చి ఓ మాస్ ముద్ర వేయించాలని చూస్తున్నాడు బోయపాటి. ప్రస్తుతం ఫాంలో ఉన్న బోయపాటితో అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణలు కూడా సినిమా చేసేందుకు సిద్ధం గా ఉన్నారు. మరి ఈ టైంలో అఖిల్ సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.