నిజం నా కస్టడీలో ఉంది! టీజర్‌ అదిరిపోయింది!

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న సినిమా ‘కస్టడీ’ టీజర్‌ గురువారం విడుదల చేశారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్‌తో టీజర్‌లో “గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకు వెళ్తుంది. అదిప్పుడు నన్ను తీసుకొచ్చింది ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్! ది ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ. (నిజం నా కస్టడీలో ఉంది.) అంటూ నాగ చైతన్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా ఆకట్టుకొన్నాయి. 

ఈ సినిమాలో నాగచైతన్య ఏ.శివ అనే పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. నాగ చైతన్యకి జోడీగా కృతీ శెట్టి నటిస్తుండగా, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ విశ్వనాథ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

తెలుగు, తమిళ్ భాషలలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై చిత్తూరి శ్రీను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు.