సినిమాల కంటే వివాదాలతోనే సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగిస్తున్న రాంగోపాల్ వర్మ భారత్‌కు ఆస్కార్ అవార్డు సాధించిన రాజమౌళిపై ఓ విచిత్రమైన ఆరోపణ చేశారు. అయితే అవి పాజిటివ్‌గా ఉన్నాయి. సినిమా బాగుంటే రూ.2,000 కోట్లు కలక్షన్స్ రాబట్టవచ్చని నిరూపించారు. కానీ వాటిని చూసి సినిమాలకు భారీ బడ్జెట్ అవసరమనే అపోహ నిర్మాతలలో ఏర్పడిందని అన్నారు.
అయితే పెద్ద, చిన్న సినిమాల విషయంలో వారి ఆలోచనలు ప్రతీ శుక్రవారం మారిపోతుంటాయని ఎద్దేవా చేశారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్‌ని రేట్లు పెంచాలని కోరుకొనే నిర్మాతలు, చిన్న సినిమాలు విడుదలవుతున్నప్పుడు టికెట్‌ని రేట్లు తగ్గించాలని కోరుకొంటున్నారని రాంగోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి, రాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని సినిమా టికెట్ ధరల పెంపు, ఓటీటీలు వాటిలో ఒకటని ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
రాజమౌళి సినిమాలను చూస్తున్న ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏ సినిమానైనా రాజమౌళి సినిమాలతో పోల్చి చూస్తూ నచ్చకపోతే తిరస్కరిస్తున్నారు. ఈ రెండు కారణాల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. అయితే రాజమౌళితో పోటీ పడాలనుకొనే దర్శకులు పుట్టుకొస్తున్నారని అన్నారు. ఇందుకు కేజీఎఫ్-2 తాజా నిదర్శనమని రాంగోపాల్ వర్మ అన్నారు.