శ్రీదేవి, శోభన్ బాబు అంటే అలనాటి నటులు కారు. సంతోష్ శోభన్, గౌరి కిషన్ జంటగా నటించిన తాజా చిత్రం పేరు శ్రీదేవి, శోభన్ బాబు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాకి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. ఫిభ్రవరిలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో ఈనెల 30 వ తేదీ నుంచి ప్రసారం కానుంది. డిస్నీ హాట్ స్టార్ ప్లస్ సంస్థ స్వయంగా ఈ విషయం ప్రకటించింది. మేనట్టపై ప్రతీకారం తీర్చుకొనేందుకు అరకు వెళ్ళిన ఫ్యాషన్ డిజైనర్ శ్రీదేవికి అక్కడ హీరో శోభన్ బాబు పరిచయం అవుతాడు. అది ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత మేనత్తపై ప్రతీకారం తీర్చుకొందా?పంతాలతో విడిపోయిన రెండు కుటుంబాలు ఎలా కలిశాయనేది ఈ సినిమా కధ. కనుక పెద్దగా మాస్ ఎలిమెంట్స్ లేవు. ఈ సినిమాలో నాగబాబు, రోహిణి, మెహబూబ్ బాషా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కెమెరా: సిద్దార్ధ్ రామస్వామి, సంగీతం: కమ్రాన్ అందించారు.