ఆస్కార్ వేదికపై పాటతో కీరవాణి కృతజ్ఞతలు

ఆర్ఆర్ఆర్‌ చిత్వానికి సంగీతం అందించిన కీరవాణి. ఈరోజు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకొన్న తర్వాత ఇంగ్లీషులో స్వరపరిచిన ఓ పాట రూపంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొని తన ప్రత్యేకతని మరోసారి చాటుకొన్నారు. ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డ్ ప్రకటించగానే అందరి కరతాళధ్వనుల మద్య కీరవాణి, ఈ పాట రచయిత చంద్రబోస్ ఇద్దరూ కలిసి వేదికపై వెళ్ళి అవార్డులను స్వీకరించారు. తర్వాత కీరవాణి తన సంతోషం వ్యక్తం చేస్తూ “నేను ప్రముఖ పాశ్చాత్య సంగీతకారులు ‘కార్పెంటర్స్’ వింటూ ఎదిగాను. నేనిప్పుడు ఆస్కార్స్‌తో మీ అందరి ముందు నిలిచాను,” అంటూ “దేర్ వస్ ఓన్లీ వన్ విష్ ఆన్‌ మై మైండ్...” అంటూ తామందరం ప్రతీ భారతీయుడి హృదయాన్ని గెలుచుకోవాలని కోరుకొంటూ ఉండేవాడిని. మా ప్రయత్నాలు ఈ అత్యున్నత స్థాయిలో నిలిపాయంటూ,” పాడిన పాటకు మళ్ళీ హర్షధ్వానాలతో అందరూ తమ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ వేదికపై కీరవాణి పాడిన ఈ పాటని మీరూ విని దానికి వచ్చిన ప్రతిస్పందన చూసి ఆనందించండి.