నేడు లాస్ ఏంజలీస్ నగరంలో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అనుకొంది. దీంతో బాటు భారత్కు మరో ఆస్కార్ అవార్డ్ కూడా లభించింది. భారత్ తరపున ఆస్కార్ అవార్డులకు ఎంపిక చేసి పంపిన ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకొంది. కార్తీక గొంజాల్వేస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీని గునీత్ మోంగా, ఆచిన్ జైన్, దగ్లాస్ బ్లష్ కలిసి నిర్మించారు.
ఓ ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన గున్న ఏనుగు (పిల్ల ఏనుగు)ను ఇద్దరు వృద్ధులు ఏవిదంగా లాలించి పెంచి పెద్ద చేశారనేది ఈ కధాంశం. అడవిలో నివసించే గిరిజనులకి, ప్రకృతికి మద్య అవినాభావ సంబంధాలను ఈ డాక్యుమెంటరీలో అత్యద్భుతంగా చూపారు. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు.