వెంకటేష్, రానా కలిసి తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ చేశారు. అదే రానానాయుడు. దీనిలో వారిద్దరూ తండ్రీకొడుకులుగా నటించారు. ఈ వెబ్ సిరీస్ గురువారం రాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ప్రసారం కావలసి ఉంది కానీ సాంకేతిక కారణాల వలన శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రసారం అవుతోంది. బాలీవుడ్ దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ కోసమే ప్రత్యేకంగా తెరకెక్కించారు. అమెరికాలో సూపర్ హిట్ అయిన ‘రే డొనోవాన్’కి హిందీ రీమేక్‌గా తీసిన ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రీమియర్ షోని టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, “ఇదొక డార్క్ ఫ్యామిలీ డ్రామా. దీనిలో ఎమ్మోషన్స్, క్రైమ్, సెక్స్ అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి కనుక దీనిని మీ ల్యాప్ టాప్ లేదా మొబైల్ ఫోన్లలో దీనిని చూస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి. ఇది పూర్తిగా రానా షో. అక్కడక్కడ కాస్త ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మమ్మల్ని క్షమించేసి సర్ధుకుపోండి,” అని విజ్ఞప్తి చేశారు.