దసరా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్‌

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా దసరా సినిమా మార్చి30న విడుదల కాబోతోంది. కనుక ఈ సినిమాలో చమ్కీల ఆంగీలేసి అంటూ సాగే మరో హుషారైన లిరికల్ వీడియో సాంగ్‌ని ఈరోజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ వ్రాసిన ఈ పాటను సంతోష్ నారాయణన్ స్వరపరచగా, రామ్ మిరియాల, ఢీ హుషారుగా పాడారు. 

 ఈ సినిమాలో నాని సింగరేణి కార్మికుడుగా నటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలోని ఓ పల్లెటూరులో ఈ సినిమా కధ సాగుతుంది. కనుక అక్కడే ఈ సినిమాకి సంబందించి అనేక సన్నివేశాలని షూట్ చేశారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, రోషన్ మాథ్యూస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లో తొలిసారిగా రూ.65కోట్ల బారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తునారు. దీనిని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, హిందీ భాషల్లో విడుదలచేస్తుండటం గమనిస్తే దీనిపై దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నట్లు అర్దం అవుతోంది.

ఈ సినిమాకి ఎడిటింగ్: నవీన్ నూలి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ అందిస్తున్నారు.