సంతోష్ శోభన్‌కి అన్నీ మంచి శకునములే

సంతోష్ శోభన్‌, మాళవికా అయ్యర్ జంటగా ‘అన్నీ మంచిశకునములే’ సినిమా టీజర్‌ విడుదలైంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత నందినీ రెడ్డి ఓ చక్కటి కుటుంబ కధా చిత్రంతో ఈ సినిమాని తెరకెక్కించిన్నట్లు టీజర్‌ చూస్తే అర్దమవుతుంది. ఈ సినిమాలో షావుకారు జానకి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, గౌతమి, రమ్య సుబ్రహ్మణియన్, ఊర్వశి, అంజు ఆల్వా నాయక్, ఆశీవినీ కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

స్వప్నా సినిమా, మిత్రవిందా మూవీస్ బ్యానర్లపై ప్రియాంకా దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి డైలాగ్స్: లక్ష్మీ భూపాల, స్క్రీన్ ప్లే : దావూద్, ఎడిటింగ్: జూనైద్, కెమెరా: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్, సంగీతం: మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా మే 18వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.