మంచు మనోజ్-మౌనిక పెళ్ళి ముహూర్తం ఖరారు?

మంచు మనోజ్, భూమా మౌనికలు తమ జీవితభాస్వాములకి విడాకులు ఇచ్చేసిన తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గత ఏడాది గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇద్దరూ కలిసి తొలిసారి మీడియా, ప్రజల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి వారి పెళ్ళిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకి మార్చి 3వ తేదీన వారిరువురూ పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డిని ప్రేమించి 2015లో పెళ్ళి చేసుకొన్నాడు. కానీ మనస్పర్ధలు రావడంతో 2019లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రాయలసీమకి చెందిన దివంగత భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికని ప్రేమించాడు. కానీ ఈసారి మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు వ్యతిరేకించడంతో ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకొన్నారు. కానీ వారి మద్య  కూడా మనస్పర్ధలు రావడంతో వారూ విడిపోయారు. ఇప్పుడు మంచు మనోజ్, భూమా మౌనికలు పెళ్ళి చేసుకోబోతున్నారు. 

మంచు మనోజ్ ఇటీవలే మనం మనం బరంపురం... అనే సబ్ టైటిల్‌తో ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా మొదలుపెట్టాడు. కొత్త దర్శకుడు వరుణ్ ఈ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నాడు. ఇదొక డార్క్ కామెడీ, హై ఓల్టేజ్ థ్రిల్లర్ మూవీ అని, 75 రోజులపాటు కెనడా, టోరెంటోలో చిత్రీకరించబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాని 6ఐఎక్స్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. సుమారు ఆరేళ్ళ విరామం తర్వాత ఈ కొత్త సినిమాతో, కొత్త జీవితభాగస్వామితో మంచు మనోజ్ జీవితం గాడిన పడుతుందని ఆశిద్దాం.