పోలీస్ ఆఫీసర్‌గా లావణ్య త్రిపాఠి…పులి-మేక వెబ్‌ సిరీస్‌

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తొలిసారిగా వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. దానిలో తొలిసారిగా ఓ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ నెల 24వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కాబోయే ఆ వెబ్‌ సిరీస్‌ పేరు పులి-మేక. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆమె కిరణ్ ప్రభ అనే ఐపీఎస్ అధికారిణిగా నటిస్తోంది. ఆమె బాస్‌గా సుమన్, సాయికుమార్ తనయుడు ఆది ఫోరెన్సిక్ వైద్య నిపుణుడిగా ఈ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇంకా గోపరాజు రమణ, రాజా చెంబోలు, సిరి హనుమంతు, సాయి శ్రీనివాస్, స్పందన పల్లి, ముక్కు అవినాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌కి పులి-మేక అనే టైటిల్‌, ఇది పోలీస్-క్రిమినల్స్ మద్య జరిగే పోరాటాలని సూచిస్తోంది. టీజర్‌, ట్రైలర్‌లో కూడా ఇది యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ అని స్పష్టమైంది. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌ ఈ వెబ్‌ సిరీస్‌కి కధ అందించడంతో పాటు తన కోన ఫిలిం కార్పొరేషన్, జీ5 కలిసి ఈ వెబ్‌ సిరీస్‌ని నిర్మించారు. ఈ వెబ్‌ సిరీస్‌కి కెమెరా: రామ్ కె మహేష్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు అందించారు.