
బ్రూస్ లీ తర్వాత కెరియర్ కాస్త నెమ్మదిగా అనిపించిన రాం చరణ్ ఇప్పుడు రాబోతున్న ధ్రువతో అంతకు అంత స్పీడ్ ఎక్కించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న ధ్రువ సినిమాలో చెర్రి తన ఇదవరకు ఏ సినిమాలో లేనంత హ్యాండ్సం లుక్స్ తో షాక్ ఇస్తున్నాడు. మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంత్ అంటూ తనలోని స్టామినా తెలియచేస్తున్న చరణ్ ఆ సినిమాకు తగ్గట్టుగా తన లుక్స్ మార్చుకున్నాడు. క్లీన్ షేవ్ లో కత్తిలా ఉన్న చరణ్ ను చూస్తుంటే ఈసారి సూపర్ హిట్ కొట్టడం ఖాయమనిపిస్తుంది.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా కోలీవుడ్ లో తని ఒరువన్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న జయం రవి సినిమా రీమేక్ గా ఈ ధ్రువ తెరకెక్కించబడుతుంది. అసలైతే ఈ పాటికల్లా రిలీజ్ అవ్వాల్సి ఉన్న ఈ సినిమా హిట్ టార్గెట్ తో కాస్త లేట్ చేశారు.
షూటింగ్ దాదాపు పూర్తయినట్టే ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని సినిమా డిసెంబర్ 2న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సో మరి చరణ్ ధ్రువ మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.