ఆదివారం ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగిన తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికలో ప్రముఖ నిర్మాత దిల్రాజు బలపరిచిన కెఎల్ దామోదర్ ప్రసాద్ ప్యానల్ విజయం సాదించింది. ఆయన తన ప్రత్యర్ధి జెమిని కిరణ్ మీద 24 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నాగార్జున మేనకోడలు సుప్రియ, కె.అశోక్ కుమార్, జాయింట్ సెక్రెటరీగా భరత్ చౌదరి ఎన్నికయ్యారు. దామోదర్ ప్రసాద్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తరపున పోటీ చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ కోశాధికారి (ట్రెజరర్), వైవిఎస్ చౌదరి, టి.ప్రసన్నకుమార్ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ తరపున పోటీ చేసిన దామోదర్ ప్రసాద్ వర్గంలో 10 మంది విజయం సాధించగా, సి.కళ్యాణ్ బలపరించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానల్ తరపున పోటీచేసినవారిలో ఐదుగురు విజయం సాధించారు.