మహాశివరాత్రికి గోపీ చంద్ రామబాణం...ఫస్ట్-లుక్‌

మాచో స్టార్ గోపీచంద్‌కి చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు. లక్ష్యం, లౌక్యం వంటి రెండు హిట్స్ అందించిన దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలోనే హ్యాట్రిక్ కొట్టాలని గోపీచంద్ రామబాణం పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర పేరు విక్కీ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రామబాణం ఫస్ట్-లుక్‌ పోస్టర్‌, ‘విక్కీస్ ఫస్ట్ యారో’ పేరుతో ఇంట్రడక్షన్ వీడియోను విడుదల చేశారు. 

ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా డింపుల్ హయతీ నటిస్తుండగా జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ: భూపతి రాజా, డైలాగ్స్: మధుసూధ పడమటి, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: వెట్రీ పళనిస్వామి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, దినేష్ కుమార్, యాక్షన్: కనాల్ కణ్ణన్, రామ్ లక్ష్మణ్‌, వెంకట్, రవివర్మ అందిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నారు.