రానా ఎందుకు మిస్ అయ్యాడంటే..!

బాహుబలి 2 కు సంబంధించిన ఫస్ట్ లుక్ కార్యక్రమంలో అందరు రాజమౌళి మళ్లీ ఎలాంటి ఫస్ట్ లుక్ తో ట్విస్ట్ ఇస్తారో అని ఎక్సయిటింగ్ గా ఎదురుచూశారు. అయితే బాహుబలిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ లో వారెవా అనిపిస్తే.. ఈ కార్యక్రమానికి భళ్లాలదేవ రానా అటెండ్ అవలేదు. మరి ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ లో రానా పాల్గొనకపోవడానికి రకరకాలుగా మాట్లాడుకున్నారు కాని రానా మాత్రం దానికి క్లారిటీ ఇచ్చాడు. 

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం చేత రానా ఆ కార్యక్రమానికి అటెండ్ అవలేదట. అయితే ఇదే సంగతి ప్రస్తావిస్తూ తాను రాకున్నా సరే తన ఆత్మ మాత్రం అక్కడే ఉంది అని ట్వీట్ చేశాడు. ఇక అనుకున్నట్టుగానే అదరిపోయే ఫస్ట్ లుక్ తో రాజమౌళి సినిమా మీద ఉన్న అంచనాలను ఇంకాస్త పెంచేశాడు. ఏప్రిల్ 28, 2017 న రిలీజ్ అవుతున్న బాహుబలి-2 కు ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు జక్కన్న.