
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా చేసిన పుష్ప సినిమా ఓ ఎత్తు అయితే దానిలో “ఊ అంటావా మావ... ఉఊ అంటావా మావ...” అనే పాటకి సమంత చేసిన డ్యాన్స్ మరో ఎత్తు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా పుష్ప-2 వస్తోంది కనుక దానిలో కూడా సమంత ఐటెమ్ సాంగ్ తప్పకుండా ఉంటుందని ఆశించడం సహజం. కనుక ఆ లెక్కనే సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ పుష్ప-2 కోసం సమంతని ఎవరూ సంప్రదించలేదని ఆమె మేనేజర్ చెప్పారు. ఒకవేళ ఎవరైనా సంప్రదిస్తే అది చాలా సంతోషంగా చెప్పుకోవలసిన విషయమే అవుతుంది తప్ప రహస్యంగా దాచుకోవడం ఎందుకు? అని ఎదురు ప్రశ్నించారు.
సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డికె దర్శకత్వంలో సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తోంది. దాని తర్వాత విజయ్ దేవరకొండతో కుషీ సినిమాలో నటించబోతోంది. ఈలోగా ఏప్రిల్ 14వ తేదీన ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కాబోతోందని సమంత మేనేజర్ చెప్పారు.