
ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోతో మంచి ప్రేక్షకాధారణ పొందినవారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఇప్పటికే కొన్ని సినిమాలలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకొన్న సుధీర్, హీరోగా కూడా ప్రయత్నించాడు కానీ ఫలించలేదు. పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘గాలోడు’ సినిమాలో హీరోగా నటించగా అది హిట్ అయ్యింది. ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్‌గా నటించగా, షకలక శంకర్, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. గత ఏడాది నవంబర్ 18న విడుదలైన ఈ మాస్ మసాలా మూవీ సినిమా నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. ఆహా సంస్థ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కాస్త వెరైటీ తెలియజేసింది.
“డ్యాన్స్ ఇరుక్కు ... కామెడీ ఇరుక్కు... యాక్షన్ ఇరుక్కు... ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇరుక్కు (ఉంది). ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది,” అని తెలియజేసింది.