నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న సినిమా పేరు ఫలానా అబ్బాయి... ఫలానా అమ్మాయి. దీనిలో మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్యా, వారణాశి సౌమ్య, హరిణీ రావు, అర్జున్ ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో నటించడంతో పాటు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. బహుశః పెళ్ళి చేసుకోకుండా ఇద్దరు సహజీవనం చేయడం కధాంశంగా కనిపిస్తోంది. టీజర్ చూస్తే హీరో హీరోయిన్ల మద్య కెమిస్ట్రీ బాగానే పండినట్లు కనిపిస్తోంది. స్నిహితులుగా ఉన్నవారు తర్వాత సహజీవనం చేయడం కధాంశంగా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులని మెప్పించగలిగాయి. మరి ఫలానా అబ్బాయి... ఫలానా అమ్మాయి ప్రేక్షకులని మెప్పిస్తారో లేదో చూడాలి.
ఈ సినిమాకి పాటలు: భాస్కర్ భట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విశ్వప్రగడ, సంగీతం: కళ్యాణి మాలిక్, కొరియోగ్రఫీ: రఘు, యష్, రియాజ్, చావ్, గులే, ఫోటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ, ఎడిటర్: కిరణ్ గంటి.ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని టిజి విశ్వప్రసాద్, పద్మజ దాసరి కలిసి మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 17వ తేదీన విడుదల కాబోతోంది.