ఆహాలో సుధీర్ బాబు ‘హంట్’ ఎప్పటి నుంచి అంటే…

సుధీర్ బాబు హీరోగా హంట్ చిత్రం జనవరి 26న థియేటర్లలో విడుదలైంది కానీ ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఫిభ్రవరి 10వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. సూరపనేని మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో సుధీర్ బాబు సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్, అసిస్టెంట్ పోలీస్ కమీషనర్‌ అర్జున్ ప్రసాద్‌గా నటించాడు. తన మిత్రుడు, తోటి ఆఫీసర్ ఆర్యన్ దేవ్ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో హీరో గతం మరిచిపోతాడు. ఆ తర్వాత తన గురించి తాను తెలుసుకొనే ప్రయత్నం చేస్తూ ఆర్యన్ దేవ్ హత్య కేసుని చేదించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగిలిన కధ. అయితే కధ, కధనం అంత గొప్పగా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాని అదరిస్తారో లేదో? ఈ సినిమాలో శ్రీకాంత్, భారత్ శ్రీనివాసన్, కబీర్ దుహాన్ సింగ్‌, మైమ్ గోపి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.