ఆవికాగోర్, సాయిరోనాక్ జంటగా చేసిన పాప్‌కార్న్ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతోంది. యాడ్ ఫిల్మ్ మేకర్‌గా పనిచేస్తున్న మురళీ గంధం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆవికాగోర్ నటించడంతోపాటు సినిమాకి సహ నిర్మాతగా కూడా ఉంది. మధుపల్లి భోగేంద్ర గుప్తా, ఎమ్మెస్ చలపతి రాజు, పెద్దింటి శేషుబాబు కలిసి ఈ సినిమాని నిర్మించారు.
ఇదొక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా అని తమ సినిమాని సెన్సార్ బోర్డు సభ్యులు చాలా మెచ్చుకొని యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని ఆవికాగోర్ తెలిపింది. ఓ షాపింగ్ మాల్ లిఫ్టులో హీరో,హీరోయిన్లు ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కధ. ఎక్కడా అసభ్యతకి తావులేకుండా అందరూ మెచ్చే విదంగా సినిమా తీశామని చెప్పారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
ఈ సినిమాకి కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురళీ గంధం, సంగీతం శ్రవణ్ భరద్వాజ్, కెమెరా:ఎంఎన్ బాలీవుడ్ రెడ్డి, కొరియోగ్రఫీ: అజయ్ సాయి, ఎడిటింగ్: కెఎస్ఆర్.