పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నందున తన సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె సినిమాలో నటిస్తున్నాడు. దాంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ అనే మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ఒకేసారి చేస్తుండటంతో పని ఒత్తిడి పెరిగి ప్రభాస్‌కి జ్వరం రాగా మూడు సినిమాల షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా పూర్తి చేశాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తికాగానే సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా, వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే ఓ సినిమా, దాని తర్వాత దిల్ రాజుతో కలిసి మరో సినిమా చేయాల్సి ఉంది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల మొదటివారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అది నిలిచిపోయింది. ప్రభాస్‌కి జ్వరం తగ్గగానే మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు.