రవితేజ రావణాసుర నుంచి తొలి సింగిల్ వచ్చేసింది

మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమా సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి “దశకంఠ రావణా... రావణా..” అనే రావణాసుర యాంథమ్‌ సాంగ్ రిలీజ్‌ అయ్యింది. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటని శాంతి పీపుల్‌, నోవ్‌లిక్‌ ఒళ్ళు జలదరించేలా చాలా ఆవేశంతో ఆలపించారు. 

ఈ సినిమాలో అనూ ఎమ్మాన్యుయేల్, ఫారియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ నామతో కలిసి రవితేజ తమ రవితేజ టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి దర్శకత్వం: సుధీర్ వర్మ, కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీంస్ శిశిరోలియో, ఫోటోగ్రఫీ: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఆర్ట్: డిఆర్‌కె కిరణ్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.