పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీగా వచ్చిన ‘గీతా గోవిందం’ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మళ్ళీ పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై తానే నిర్మించబోతున్నట్లు నిర్మాత దిల్‌రాజు తెలియజేశారు. విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్‌దిల్‌రాజు ముగ్గురూ ఈ సినిమా గురించి మాట్లాడుకొంటుండగా తీసిన ఓ ఫోటోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాకి సంబందించి త్వరలోనే పూర్తి వివరాలని ప్రకటిస్తామని దిల్‌రాజు తెలిపారు. 

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో గత ఏడాది విడుదలైన లైగర్‌ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ ఇంతవరకు మరో సినిమాకి సంతకం చేయలేదు. ఇదివరకు శివా నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా మొదలుపెట్టిన ‘ఖుషీ’ సినిమా చేసేందుకు సిద్దపడినప్పటికీ ఆమె మయో సైటీస్ వ్యాధి బారినపడటంతో ఆ సినిమా షూటింగ్‌ జరుగడంలేదు. సమంత ఇప్పుడు కోలుకొన్నందున త్వరలో ఖుషీ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మళ్ళీ మొదలవవచ్చు. ఒకవేళ ఆలస్యమైతే పరశురామ్‌తో సినిమా మొదలుపెట్టేస్తారు.