
మహేష్ మురుగదాస్ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఆ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు అనుకోకుండా గాయమైనట్టు టాక్. అయితే రకుల్ కు ఏమైంది ఏంటి అని ఒకటే హడావిడి చేశారు మీడియా వారు. తీరా చూస్తే రకుల్ తనంతట తానే నాకేం గాయం అవ్వలేదు జస్ట్ వేలు బెణికింది అంతే.. నా పై చూపిస్తున్న ఈ అభిమానానికి థాంక్స్ అని ట్వీట్ చేసింది. ఆమెకు తగిలింగి చిన్న గాయమే అయినా మీడియా వారు రాసిన రాతలు అంతా ఇంతా కాదు.
అది చూసి రకుల్ ఫ్యాన్స్ ఒకటే కంగారు పడ్డారు. ఈ మధ్యనే తన ఫ్యాన్స్ మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రకుల్ కు ఉన్న ఫాలోయింగ్ ఏంటో ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు చేసిన హడావిడే తెలియచేస్తుంది. పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తున్న ఫైట్ లో ఆమె కాలు సడెన్ గా బెణికిందట దీనికి ఓ నానా రచ్చ చేసేస్తున్నారు. అయితే రకుల్ మాత్రం తనపై చూపిస్తున్న ఈ అభిమానానికి థాంక్స్ అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహంలో నింపింది.
టాలీవుడ్ లో అతి తక్కువ టైంలో స్టార్ డం తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పాలి. వరుసగా స్టార్ హీరోల అవకాశాలను కొట్టేస్తున్న ఈ అమ్మడు సినిమా చేతే హిట్ అన్న సెంటిమెంట్ బలంగా కుదిరింది. ఈ ఇయర్ ఇప్పటికే నాన్నకు ప్రేమతో, సరైనోడు హిట్లతో మంచి జోరు మీదున్న రకుల్ చరణ్ ధ్రువలో కూడా నటిస్తుంది.