శాకుంతలం సినిమాకి డబ్బింగ్ చెప్పిన చిన్నారి అర్హ

శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమ గాధని శాకుంతలం సినిమాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో శకుంతల,దుష్యంతుల కుమారుడిగా అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ నటించింది. తన పాత్రకి అర్హ డబ్బింగ్ చెప్పుకొంది కూడా. అర్హ డబ్బింగ్ చెపుతున్నప్పుడు తీసిన చిన్న వీడియో క్లిప్‌ని సినీ బృంద విడుదల చేసింది. అమాయకంగా కనిపిస్తున్నా ఏమాత్రం భయం,బెరుకు లేకుండా “దూరం.. దూరం...” అంటూ బెబే అర్హ డబ్బింగ్ చెప్పడం చూడ ముచ్చటగా ఉంది. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి.శాకుంతలం సినిమా ఫిభ్రవరి 17న విడుదల కాబోతోంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.