బిచ్చగాడు సినిమా హీరో విజయ్‌ ఆంటోనీ పరిస్థితి విషమం?

బిచ్చగాడు సినిమాతో కోలీవుడ్ నటుడు విజయ్‌ ఆంటోనీ ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. మలేషియాలో దాని సీక్వెల్‌ బిచ్చగాడు-2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సముద్రంలో బోట్ చేజింగ్ సన్నివేశం షూట్ చేస్తుండగా ఆంటోనీ కూర్చోన్న బోట్ కెమెరా ఉన్న బోట్‌ని బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆంటోనీ మొహానికి తీవ్ర గాయలవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన దవడ ఎముక విరిగింది. పళ్ళు ఊడిపోయాయని సమాచారం. ఆంటోనీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన తల్లితండ్రులు, భార్య ఫాతిమా మలేషియా చేరుకొని, అతనిని ప్రత్యేక విమానంలో చెన్నై తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో విజయ్‌ ఆంటోనీకి చికిత్స అందిస్తున్నారు.