
బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల మన పర బేధాలు లేకుండా సినిమా అందరి చేత ప్రమోట్ చేయబడింది. ఈ సినిమా పార్ట్ 2 ఎలాంటి అంచనాలతో రాబోతుందో తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో ఖైదిగా 9 ఏళ్ల విరామం తర్వాత వస్తున్న మెగాస్టార్ చిరంజీవి బాహుబలి సెట్స్ కు వెళ్లారు.
సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు ప్రభాస్, రాజమౌళి షాక్ ఇవ్వడమే కాకుండా సినిమా షూటింగ్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. తన తనయుడికి మగధీర లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి రెండు పార్ట్ లుగా తీయడం చిరు మెచ్చుకున్నారు. ఇక ఆ సెట్స్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ పక్క ఖైదిగా వచ్చేందుకు సిద్ధమవుతున్న చిరు మరో పక్క బాహుబలి టీంను స్పెషల్ గా మీట్ అవడం విశేషం.