ఆర్ఆర్ఆర్‌ సినిమా చూసినందుకు చాలా థాంక్స్!

ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్న ఆర్ఆర్ఆర్‌ సినిమాకి ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకొంది. తాజాగా ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్‌ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకొంది. అయితే ఈ అవార్డులన్నిటి కంటే గొప్ప అవార్డు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్‌ సినిమాని చూసి ప్రశంశించడమే అని రాజమౌళి పొంగిపోతున్నారు. తన సినిమాని ఆయన రెండుసార్లు చూడటం తనకు చాలా ఆనందం కలిగిస్తోందని రాజమౌళి ట్వీట్ చేశారు. “మీరు మాతో పది నిమిషాలు గడపడం నమ్మలేకపోతున్నాను. మీరు మా ఆర్ఆర్ఆర్‌ సినిమాని చూసి విశ్లేషించి చెప్పడం నా జీవితంలో మరిచిపోలేను. ఇందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని ట్వీట్ చేశారు.