మా కుటుంబంలోనే పోటీ ఉంది.. ఎన్టీఆర్‌ ఉండదా?

ఆర్ఆర్ఆర్‌ సినిమా దేశవిదేశాలలో కూడా విజయవంతం అవడమే కాక ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా అందుకొంది. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ సినీ బృందంతో కలిసి లాస్ ఏజంలీస్‌లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 

ఈ అవార్డు అందుకొంటున్న సమయంలోనే నేను తండ్రి కాబోతున్నాననే విషయం తెలిసినప్పుడు చాలా సంతోషించాను. నా ఆనందం రెట్టింపు అయిన్నట్లనిపించింది. అంతకు ముందు రంగస్థలంలో ఓ పల్లెటూరిలో చెవిటివాడిగా నటించినప్పుడు చాలా కొత్త విషయాలు తెలుసుకొన్నాను. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ సినిమాలో చేసినప్పుడు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. నేను ఎక్కువగా డ్రామా, బాగా డెప్త్ ఉన్న పాత్రలు, కధలని ఇష్టపడతాను.

రాజమౌళి ఎక్కువగా నటుల హావభావాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సినిమాలో నటించడం నాకేప్పటికీ మరిచిపోలేని గొప్ప మధురానుభూతులు ఇచ్చింది. మొత్తంగా 2022 సంవత్సరం నాకు తీపి జ్ఞాపకాలని ఇచ్చి వెళ్ళింది. కనుక 2023 కూడా అలాగే సాగాలని కోరుకొంటున్నాను. ఆర్ఆర్ఆర్‌ సినిమాలో తారక్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. వీలైతే అతనితో కలిసి మరో సినిమా చేయాలని ఉంది.    

 ఒకప్పుడు ఎన్టీఆర్‌ గారికి మా నాన్నగారికి మద్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. తర్వాత తరానికి చెందిన మా మద్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మా మెగా కుటుంబంలోనే ఆరుగురు నటుల మద్య పోటీ ఉంది కదా? మా మద్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రాజమౌళి నన్ను, ఎన్టీఆర్‌ని తన సినిమాలోకి తీసుకొన్నప్పుడు చాల్ థ్రిల్ అయ్యాను. 

భవిష్యత్‌లో టాలీవుడ్‌, కోలీవుడ్, హాలీవుడ్ అన్నీ పోయి వాటి స్థానంలో కేవలం గ్లోబల్ ఫిలిమ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. నా సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కంటే థియేటర్‌లో ప్రేక్షకులు చేసే కామెంట్స్ నేను ఎక్కువ ఇష్టపడతాను. హాలీవుడ్ ‘టాప్‌ గన్‌’ సిరీస్‌ సినిమాలను నేను చాలా ఇష్టపడతాను. 2023లో నేను నటించినవి మూడు సినిమాలు, 2024లో మూడు సినిమాలు రిలీజ్‌ అవుతాయి,” అని రామ్ చరణ్‌ చెప్పారు.