నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ ధమాకా... ఎప్పటి నుంచంటే

వరుస ఫ్లాపులతో బాధపడుతున్న మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ డిసెంబర్‌ 23న థియేటర్‌లలో రిలీజ్‌ అయినప్పుడు అదీ బాగోలేదని రివ్యూలు వచ్చినా సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు... రూ.100 కోట్లు కలక్షన్స్‌ సాధించి రికార్డ్ నెలకొల్పింది కూడా. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 22 నుంచి ప్రసారం కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజకీ జోడీగా శ్రీలీల నటించింది. రవితేజ మార్క్ యాక్షన్, పంచ్ డైలాగ్స్, కామెడీ, రొమాన్స్ అన్ని పుష్కలంగా ఉండటంతో సినిమా ధమాకా అయ్యింది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రావు రమేష్, అలీ, ప్రవీణ్, చిరాగ్ జానీ, హైపర్ ఆది, జయరాం, సచిన్ ఖేడేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.      

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు. డబుల్ ఇంపాక్ట్ సబ్ టైటిల్‌తో వస్తున్న ధమాకా చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రసన్న కుమార్‌ బెజవాడ, పాటలు: రామజోగ్గయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సుద్ధాల అశోక్ తేజ్, సంగీతం: భీంస్ సెసీరోలియో, కొరియోగ్రఫీ: శేఖర్ విజే జానీ మాస్టర్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, స్టంట్స్: రామ్, లక్ష్మణ్ అందించారు.