నీకేమో అందమెక్కువా... నాకేమో తొందరెక్కువ!

బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్‌ జంటగా వస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి “నీకేమో అందమెక్కువా... నాకేమో తొందరెక్కువ...” అంటూ సాగే మరో లిరికల్ వీడియో సాంగ్‌ని ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటని మికా సింగ్, గీతామాధూరి, డి.వేల్ మురుగన్ ఆలాపించగా దానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలో మిగిలిన పాటలతో పోలిస్తే ఇది అంత గొప్పగా లేదనిపిస్తుంది.   

వాల్తేర్ వీరయ్య సినిమాలో మాస్ మహారాజ రవితేజ, రాజేంద్ర ప్రసాద్, కేథరిన్ ధెరిసా, బాబీ సింహా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందించారు.