.jpg)
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ‘హనుమాన్’ టీజర్ విడుదల చేసినప్పుడు అది వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తీస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్ కంటే చాలా గొప్పగా ఉందని సర్వత్రా ప్రశంశలు అందుకోవడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మరో మోషన్ పోస్టర్ విడుదల చేసింది. హనుమాన్ చాలీసా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావత్ ప్రపంచదేశాలకు హనుమంతుడి కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తున్నట్లు చూపారు. దానికి అనుదీప్ దేవ్ అందించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విని తీరాల్సిందే.
ఈ సినిమాలో హనుమంతుడి దివ్యశక్తులు కలిగిన యువకుడిగా తేజ సజ్జా, అతనికి జోడీగా అమృత అయ్యర్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శర కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్యా, గెట్ అప్ శ్రీను, రాజ్‌భవన్ దీపక్ శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ, మరాఠీ భాషలతో పాటు చైనీస్, కొరియన్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం అనుదీప్ దేవ్, ఎడిటింగ్: ఎస్బీ రాజు తలారి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 12న విడుదల కాబోతోంది.