కళ్యాణం కమనీయం ట్రైలర్‌ వచ్చేసింది

సంక్రాంతికి చిరంజీవి, బాలయ్యల సినిమాలు వాటితో పాటు కోలీవుడ్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు జనవరి 12,13 తేదీలలో విడుదల కాబోతున్నాయి. వాటి మద్యలో మరో చిన్న సినిమా కూడా వస్తోంది. అదే సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జోడీగా నటించిన కళ్యాణం కమనీయం. ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతుండటంతో ట్రైలర్‌ విడుదల చేశారు. స్వీటీ అనుష్క ఈ ట్రైలర్‌లో విడుదల చేసింది. ఈ సినిమాని కొత్త దర్శకుడు ఆళ్ళ అనిల్ కుమార్‌ చాలా కమనీయంగా తెరకెక్కించిన్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ కనుక నాలుగు పెద్ద సినిమాల నుంచి పోటీ తట్టుకొని నిలబడవచ్చనిపిస్తోంది. యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/KJGiUV2oV3o" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>