నువ్వో పనికిమాలిన వాడివి... కాదు నువ్వే వేస్ట్ గాడివి!

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగినా నటీనటులందరూ మీడియా ముందుకు వచ్చి మరీ కీచులాడుకొంటుంటారు. అయితే నిర్మాతల మండలిలో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులే ఉన్నాయని ఈరోజు నిర్మాతల మండలి సమావేశంలో బయటపడింది. 

ఈరోజు జరిగిన సమావేశంలో మిగిలిన నిర్మాతలు రెండేళ్ళు గడిచినా ఎందుకు ఎన్నికలు జరిపించడం లేదంటూ ప్రెసిడెంట్‌గా ఉన్న సి.కళ్యాణ్‌ని గట్టిగా నిలదీశారు. అప్పుడు ఆయన వారితో వాగ్వాదం చేస్తుంటే మరో నిర్మాత దానిని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించసాగారు. 

దాంతో సి.కళ్యాణ్‌ ఆయనపై విరుచుకు పడుతూ “ఏయ్ ఎవరు నువ్వు? ఎందుకు షూట్ చేస్తున్నావు? ఇక్కడ నీకేం పని? బయటకి పో...” అంటూ కోపంగా అరిచేసరికి ఆ నిర్మాత “నేను కూడా ఈ మండలిలో సభ్యుడినే సార్...” అంటూ వినయంగా సమాధానం చెప్పబోతే “నువ్వు సభ్యుడివా... నువ్వో పనికిమాలినవాడివి బయటకి పో...” అంటూ సి.కళ్యాణ్ గట్టిగా అరిచారు. దాంతో ఆ నిర్మాత కూడా ఆగ్రహంగా “నేను కాదు... నువ్వే ఓ పనికిమాలిన ప్రెసిడెంటువి... నువ్వే పో...” అంటూ ఘాటుగా బదులివ్వడంతో వారిరువురి మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పుడు మిగిలినవారు ఇద్దరికీ నచ్చజెప్పి శాంతింపజేశారు. కానీ ఈ ఘటన తెలుగు సినీ నిర్మాతల మద్య ఎంత వైరం ఉందో కళ్ళకి కట్టినట్లు చూపింది. మీరూ చూడండి...          

(Vidoe Courtecy: Eenadu Media)